చిత్తూరు: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం BSR NESW

చిత్తూరు: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
ట్రాక్టర్ బోల్తా పడి 8మంది భక్తులకు గాయాలైన ఘటన శనివారం సాయంత్రం పెనుమూరు మండలంలో చోటుచేసుకుంది. కలిగిరి కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి చుట్టుపక్కల గ్రామానికి చెందిన 30 మంది భక్తులు ట్రాక్టర్ లో వెళ్లారు. దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో 8 మందికి గాయాలయ్యాయి. వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.