చిత్తూరు: దీపావళి ప్రమిదల పంపిణీ BSR NESW

చిత్తూరు: దీపావళి ప్రమిదల పంపిణీ
చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ దీపావళి సందర్భంగా పారిశుధ్య కార్మికులు, కార్యాలయ ఉద్యోగులు, వార్డు కార్యదర్శులు, స్థానిక ప్రజలకు మట్టి ప్రమిదలు శుక్రవారం పంపిణీ చేశారు. దీపావళిని ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలన్నారు. నగరపాలక ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సహాయ కమిషనర్ గోవర్ధన్, ఎంహెచ్ డాక్టర్ లోకేష్, సీఎంఎం గోపి, సిబ్బంది పాల్గొన్నారు.