కాణిపాకం: కనుల పండువగా వరసిద్ధుడి కళ్యాణం BSR NESW

కాణిపాకం: కనుల పండువగా వరసిద్ధుడి కళ్యాణం
పాలకొల్లులోని క్షత్రియ కళ్యాణ మండపంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కల్యాణోత్సవం కనుల పండువగా గురువారం జరిగింది. ఉత్సవమూర్తులను అలంకరించి గణపతి హోమం నిర్వహించి భక్తులు వీక్షిస్తుండగా అమ్మవార్ల మెడలో స్వామివారు మాంగళ్య ధారణ గావించారు. ఎమ్మెల్సీ మేక శేషుబాబు, పాలకమండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, గజల్ శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.