చిత్తూరు: 20న రీజనల్ జాబ్ మేళా BSR NEWS

చిత్తూరు: 20న రీజనల్ జాబ్ మేళా
ప్రాంతీయ మెగా ఉద్యోగ మేళా ఈ నెల 20న చిత్తూరులో నిర్వహించనున్నట్లు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. చిత్తూరులోని శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(ఎస్వీసెట్)లో జరగనున్న మేళాలో వంద కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కల్గి.. వయస్సు 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారు హాజరుకావచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.