వైభవంగా సిద్ధి, బుద్ధి సమేత శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం BSR NESW

వైభవంగా సిద్ధి, బుద్ధి సమేత శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం
శ్రీ కాశీ విశ్వనాథ మహా సామ్రాజ్య పట్టాభిషేకం, సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వారణాసిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, వారణాసి శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి సంయుక్త దేవస్థానం ఆధ్వర్యంలో కాణిపాకం నుంచి స్వామివారి విగ్రహాలతో ఈ కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేశు పాల్గొన్నారు.