చంద్రబాబు పొత్తులపై ఆశ్చర్యమేమీ లేదు: పెద్దిరెడ్డి BSR NEWS

చంద్రబాబు పొత్తులపై ఆశ్చర్యమేమీ లేదు: పెద్దిరెడ్డి
AP: ఎన్నికల వేళ చంద్రబాబు పొత్తుల వ్యవహారం ఊహించినదేనని, ఆశ్చర్యమేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో ఉన్నవారంతా టీడీపీ నాయకులేనని ఎద్దేవా చేశారు. టీడీపీకి వామపక్షాలు ప్రత్యక్షంగా.. కాంగ్రెస్ పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. మొదటి నుంచి ఈ పార్టీలన్నీ కలిసే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కలిసి వచ్చినా సీఎం జగన్ సింగిల్గానే వస్తారని స్పష్టం చేశారు.