AP Budget 2024 : రూ.2.85లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న మంత్రి బుగ్గన

AP Budget 2024 : రూ.2.85లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న మంత్రి బుగ్గన

BSR NEWS

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2లక్షల86వేల389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు

AP Assembly Budget Session 2024 : ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2లక్షల86వేల 389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది.. మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంధంగా భావిస్తారని బుగ్గన అన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించామని, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో సమాజంలో అత్యంత బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని బుగ్గన అన్నారు. మహనీయులు, మహాత్ములు, మహానుభావుల ఆలోచనలు, సూక్తులను ప్రతిబింబించేలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన సాగిస్తుందని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాదు, ఆయన అడుగుజాడల్లోనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు.

  • బడ్జెట్ వివరాలు..
  • రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్.
  • రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు.
  • మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు.
  • ద్రవ్యలోటు రూ.55 వేల 817కోట్లు.
  • రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు.
  • జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం.
  • జీఎస్టీపీలో ద్రవ్యలోటు 3.51శాతం.
  • మొదటి మూడు, నాలుగు నెలల కాలానికే బడ్జెట్ ఆమోదం.
  • ఎన్నికల తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం