కాణిపాకం ఈవోగా వెంకటేశు కొనసాగింపు BSR NEWS

కాణిపాకం ఈవోగా వెంకటేశు కొనసాగింపు
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవోగా వెంకటేశును మరో సంవత్సరం పాటు కొనసాగిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉన్న ఆయన గతేడాది నవంబర్ 18న కాణిపాక ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 18వ తేదీ నాటికి సంవత్సరం పూర్తి కావడంతో మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.