చిత్తూరు: హైకోర్టు జడ్జిని కలిసిన ఎస్పీ BSR NEWS

చిత్తూరు: హైకోర్టు జడ్జిని కలిసిన ఎస్పీ
ఏపీ హైకోర్టు జడ్జి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి రఘునందన్ రావును ఎస్పి రిశాంత్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని కోర్టు కాంప్లెక్స్ లో జ్యుడిషియల్ అధికారుల జిల్లా స్థాయి పీరియాడికల్ సదస్సుకు హాజరయ్యేందుకు హైకోర్టు జడ్జి పట్టణానికి విచ్చేశారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఉన్న ఆయనను ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.