Natti Kumar : చిరంజీవికి పద్మవిభూషణ్ పవన్ కల్యాణ్ వల్లే వచ్చిందట.. నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు

BSR NEWS
చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై అభినందనలు చెబుతూనే దీని వెనుక రాజకీయ వ్యూహం ఉండి ఉండచ్చంటూ కామెంట్స్ చేసారు నిర్మాత నట్టికుమార్. ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Natti Kumar : చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం గర్వకారణం అంటూనే ఇదంతా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా రాజకీయ వ్యూహం అని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎలక్షన్స్ టైమ్‌లో పవన్ కల్యాణ్ సపోర్ట్ కోసం ఇలా చేసి ఉండచ్చంటూ మాట్లాడారు.
Hanuman Song : ‘హనుమాన్’ సినిమా నుంచి అంజనాద్రి సాంగ్ రిలీజ్.. పాట విన్నారా? గూస్ బంప్స్ గ్యారెంటీ..
గణతంత్ర దినోత్సవ వేళం కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవిని ‘పద్మవిభూషణ్’ వరించింది. దీనిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ప్రస్తావన తెచ్చారు. కరోనా టైమ్‌లో ఆయన చేసిన సేవలు అసామాన్యమైనవని ఆయన కూడా పద్మ అవార్డుకు అర్హుడంటూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం సంతోషమని అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆయనకు రావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని అన్నారు. సినీ రంగంతో పాటు బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు. అయితే చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం వెనుక మోదీ, అమిత్ షా రాజకీయ వ్యూహం ఖచ్చితంగా ఉంటుందని కామెంట్ చేసారు. పవన్ కల్యాణ్ వల్ల బీజేపికీ సపోర్ట్ దొరుకుతుందని కావచ్చు.. కాపుల సపోర్ట్ దొరుకుతుందనే ఉద్దేశం కావచ్చు ఏదైనా మోదీ, అమిత్ షా లాభం లేని పని చేయరంటూ మాట్లాడారు. రాజమౌళి ఫాదర్‌కి రాజ్య సభ టికెట్ ఇచ్చి రాజమౌళిని సినిమా తీయమని అడిగే టైప్ అంటూ విమర్శలు చేసారు.
Padma Awards 2024: ఒక్కటి కన్నా ఎక్కువ ‘పద్మ’ అవార్డులు పొందిన ప్రముఖులు వీరే..
కరోనా టైమ్‌లో ఎన్నో సేవలు అందించిన సోనూ సూద్ వంటి వ్యక్తి పద్మ అవార్డుకు నిజంగా అర్హుడని .. ఆయన గురించి మోదీకి తెలియకపోవచ్చునంటూ సెటైర్లు వేసారు నట్టికుమార్. పద్మవిభూషణ్‌కి చిరంజీవి అర్హుడు కానీ ఆయనకు అనుకోకుండా వచ్చింది.. సోనూ సూద్‌కి కూడా భవిష్యత్తులో వస్తుందని ఆశిద్దాం అంటూ మాట్లాడారు నట్టికుమార్. ఈ అంశంపై ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.