ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించండి..* BSR News

ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించండి..*  BSR News

        *ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించండి..* 

చిత్తూరు : విద్యార్థులు ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని, 18 సంవత్సరాలు పూర్తయిన వారంతా ఓటరుగా నమోదు కావాలని సహాయ కమిషనర్ గోవర్థన్ పిలుపునిచ్చారు. కమిషనర్ డా. జె అరుణ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా పీవీకేఎన్ కళాశాలలో విద్యార్థులకు "ఎన్నికల్లో ఓటర్ల పాత్ర" అనే అంశంపై వక్తృత్వ, "ఓటరు యొక్క హక్కులు, బాధ్యతలు" అనే అంశంపై వ్యాసరచన, "ఎన్నికల - సంఘం" అంశంపై క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మధ్యాహ్నం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ గోవర్థన్ మాట్లాడుతూ ఓటు హక్కు నమోదు, ఓటు వినియోగం, ప్రాధాన్యత అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డా. లోకేష్, సీఎంఎం గోపి, అధ్యాపకులు రెడ్డి భాష, విద్యార్థులు పాల్గొన్నారు.

----------//---------