పత్రికా ప్రకటన BSR NESW

పత్రికా ప్రకటన BSR NESW

                         పత్రికా ప్రకటన 

75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని పోలీస్ కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ షన్మోహన్ సగిలి, IAS గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ వై.రిశాంత్ రెడ్డి, ఐ.పి.ఎస్ గారు.

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ పెరేడ్ గ్రౌండ్ నందు 75వ గణతంత్ర దినోత్సవం పురష్కరించుకొని పెరేడ్ రిహార్సల్ నిర్వహించడం జరిగినది. ఈ పెరేడ్ రిహార్సల్ కు ముఖ్య అతిదిగా జిల్లా కలెక్టర్ శ్రీ షన్మోహన్ సగిలి, IAS గారు విచ్చేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పెరేడ్ నిర్వహణను పరిశీలించిన కలెక్టర్ మరియు ఎస్పీ గారు సంతృప్తి వ్యక్తం చేసారు. ముఖ్య అతిథులు హాజరు, వారి సీటింగ్, జాతీయ పతాక ఆవిష్కరణ, జాతీయ జెండాకు గౌరవ వందనం చేయడం, పరిశీలన వాహనం పై వెళ్లి పరేడ్ పరిశీలించడం, తదితర అంశాలపై రీహార్సల్ చేయించారు. పెరేడ్ నందు సివిల్, ఏ.ఆర్, హోం గార్డ్స్, యెన్.సి.సి., స్కౌట్ విద్యార్థులు మరియు పోలీస్ బ్యాండ్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బముగా ఎస్పీ గారు మాట్లాడుతూ పెరేడ్ ను బహు చక్కగా ప్రదర్శించారని 75వ గణతంత్ర దినోత్సవం సందర్బముగా మీ ప్రదర్శనతో ప్రజలను అలరించాలని తెలిపారు. 

ఈ పెరేడ్ రిహార్సల్ కార్యక్రమములో అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. శ్రీ జి.నాగేశ్వర రావు, ఎస్.బి. డి.ఎస్.పి. శ్రీ శ్రీనివాస రెడ్డి, చిత్తూరు పట్టణ డి.ఎస్.పి. శ్రీ కె.శ్రీనివాస మూర్తి, దిశా డి.ఎస్.పి. శ్రీ జె.బాబు ప్రసాద్, డి.టి.సి. డి.ఎస్.పి. శ్రీ శ్రావణ్ కుమార్, ఏ.ఆర్. డి.ఎస్.పి. శ్రీ మురళీధర్, రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ ఉలసయ్య, ఆర్.ఐ. అడ్మిన్ శ్రీ నీలకంటేశ్వర రెడ్డి, ఆర్.ఐ. MTO శ్రీ మధు, ఆర్.ఐ హోం గార్డ్స్ శ్రీ భాస్కర్, ఆర్.ఎస్.ఐ లు మరియు తదితరులు పాల్గొన్నారు.