జడ్జి ముందు నిజాలు ఒప్పుకున్న పోసాని... ఏం చెప్పారంటే..!

జడ్జి ముందు నిజాలు ఒప్పుకున్న పోసాని... ఏం చెప్పారంటే..!
  • BSR NEWS
  • పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్
  • తాను మాట్లాడిన మాటలు నిజమేనని ఒప్పుకున్న పోసాని
  • తన భార్యను తిట్టారని... ఆ బాధతోనే తాను అలా దూషించాల్సి వచ్చిందని వివరణ   

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వేకోడూరు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, చంద్రబాబులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నిన్న ఆయనను విచారించారు. 9 గంటల పాటు విచారించిన అనంతరం... ఆయనను రైల్వేకోడూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిన్న రాత్రి 9.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు 7 గంటల సేపు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. 

మరోవైపు కోర్టులో వాదనల సందర్భంగా జడ్జి ముందు పోసాని వాస్తవాలను అంగీకరించారు. తన భార్యను దూషించారని... అందుకే ఆ బాధతో తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. తాను మాట్లాడిన మాటలు నిజమేనని అంగీకరించారు. తన భార్యను దూషించిన దూషణలను కట్ చేసి... బాధతో తాను మాట్లాడిన మాటలను మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను దూషించిన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించారని పోసాని పేర్కొన్నారు.