కాణిపాక ఆలయంలో భక్తుల రద్దీ BSR NESW

కాణిపాక ఆలయంలో భక్తుల రద్దీ BSR NESW

                  కాణిపాక ఆలయంలో భక్తుల రద్దీ

కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ క్యూ లైన్లు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అయ్యప్పస్వామి భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు పోటెత్తాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించారు. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామి దర్శనం కల్పిస్తున్నారు.