ఐరాల: అంబేద్కర్ విగ్రహాలకు ముసుగు వేసిన అధికారులు BSR NEWS

ఐరాల: అంబేద్కర్ విగ్రహాలకు ముసుగు వేసిన అధికారులు
పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాలకు ఎన్నికల కోడ్ నేపంతో అధికారులు ముసుగు వేశారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు మాత్రమే ముసుగువేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కానీ అంబేద్కర్ ఏ పార్టీకి చెందినవారో ముసుగువేసిన అధికారులు తెలపాలని మాజీ బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు మహేష్ స్వేరో డిమాండ్ చేశారు.