ఎన్నికల్లో నోడల్ అధికారులదే కీలక బాధ్యత: జేసీ శ్రీనివాసులు. BSR NEWS

ఎన్నికల్లో నోడల్ అధికారులదే కీలక బాధ్యత: జేసీ శ్రీనివాసులు
ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులదే కీలక బాధ్యత అని జేసీ శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై శనివారం సమావేశం నిర్వహించారు. 19 నుంచి జరిగే ఎన్నికల సమావేశాలకు అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. 2024 ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ఎన్నికల నియమావళి బుక్ పై అవగాహన పెంచుకోవాలన్నారు.