YSR జిల్లాలో 2 రోజులు సీఎం పర్యటన BSR NESW

YSR జిల్లాలో 2 రోజులు సీఎం పర్యటన
AP: సీఎం జగన్ 2 రోజులు YSR జిల్లాలో పర్యటించనున్నారు. రేపు మ.12 గంటలకు రాయచోటిలో మండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానమ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. మ.1.30కు పులివెందులలో శ్రీకృష్ణా టెంపుల్ను ప్రారంభిస్తారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, రాత్రికి ఇడుపులపాయలో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం ఆర్కే వ్యాలీ, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం తాడేపల్లికి పయనమవుతారు.