టీడీపీ, వైసిపి, వలస నేతలను దర్శి నియోజకవర్గం నుండి పారద్రోలండి! కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సైదా

టీడీపీ, వైసిపి, వలస నేతలను దర్శి నియోజకవర్గం నుండి పారద్రోలండి!
కాంగ్రెస్ పార్టీ నీ ఆదరించండి! రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సైడా!
తాళ్లూరు .(27.నవంబర్) రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని, నియోజకవర్గంలోని వలస నేతలను నియోజకవర్గ నుంచి పార ద్రోలాలని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడే కాంగ్రెస్ పార్టీ నీ ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సైదా నేడు తాళ్లూరు మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర సభలో ఆయన మాట్లాడుతూ అన్నారు, దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దేశంలో రాష్ట్రంలో అలాగే దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవానికి ప్రజలంతా సహకరించాలని ఆయన అన్నారు, రైతులుకు అండ కాంగ్రెస్ జండా!అని, రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేననీ నాగార్జునసాగర్, శ్రీశైలం, గుండ్ల కమ్మ, రామతీర్థ జలాశయాలు, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగాయని ఆయన అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడ బలిమి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి పాటుపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దళితుల్ని ముఖ్యమంత్రిగా మంత్రులుగా రాష్ట్రపతులుగా రాజకీయ ఉన్నత స్థానాలకు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రానున్న ఎన్నికలలో దళితులు బడుగు బలహీనవర్గాలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆయన అన్నారు . జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి షేక్ రెహనా భాను మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ధరలు ఆకాశాన్ని అంటేయని మద్యపానాన్ని నిషేదిస్తానన్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మధ్యప్రదేశ్గా మార్చారని కూలినాలు చేసుకునే ప్రజలు చేసుకునే మద్యానికి బానిసలుగా మారి సంసారాన్ని గుల చేసుకుంటున్నారని ఆమె జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.దర్శి నియోజకవర్గంలో తాళ్లూరు మండలంలో వివిధ గ్రామాల్లో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కైపు వెంకట కృష్ణారెడ్డి చేపట్టిన పాదయాత్రకు మండలంలోని వివిధ గ్రామాల్లో అపూర్వ స్పందన లభించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులు కుప్పగా మారిందని, రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్క పౌరుని మీద 1,50,000 అప్పు నెత్తిన పడిందని, మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలుపలుస్తాను అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మధ్య ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారని, ల్యాండ్, సాండ్ ,మైనింగ్ మాఫియా రోజురోజుకీ పెచ్చరిల్లి పోతున్నారని రాష్ట్రంలో శాంతి పద్ధతులు లోపించాయని తిరిగి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాళ్లూరు మండలంలోని గంగవరం,లింగలపాడు, మాధవరం, కొత్తపాలెం,తాళ్లురు, విటలపురం, చంద్రగిరి వరకు దాదాపు22 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది
దారి పొడవునా రైతులు, కార్మికులు, శ్రామికులు కూలీలు, యువకులను, మహిళలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది 5 వ. రోజు పాదయాత్ర దాదాపు22 కిలోమీటర్ల మేర కొనసాగింది పాదయాత్ర ఉత్సాహభరితంగా కొనసాగింది పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను, పార్టీ పాటలను విని ప్రజలు తిరిగి కాంగ్రెస్ అధికారంలో రావాలని కాంగ్రెస్ పార్టీని కైపు వెంకట కృష్ణారెడ్డిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండలానికి చెందినబ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారం రఘుమరెడ్డి, తాటికొండ వంశీ శ్రీనాథ్ ,విల్సన్, అజయ్, అశోక్ రెడ్డి ప్రతాప్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.