YS Jagan: జగన్‌పై దాడికి యత్నించిన సొంతపార్టీ కార్యకర్త.. వీడియో ఇదిగో

BSR NEWS
- పులివెందులలో ఘటన
- జగన్‌పైకి దూసుకొచ్చిన కార్యకర్త
- లాగిపడేసిన భద్రతా సిబ్బంది
- భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఓ కార్యకర్త దాడికి యత్నించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులివెందులలోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. నీ వల్లే పార్టీకి చెడ్డపేరు వచ్చిందంటూ ఆ కార్యకర్త జగన్‌పైకి దూసుకెళ్లడం, భద్రతా సిబ్బంది అతడిని నెట్టివేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ‘టీం లోకేశ్’ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా వైసీపీ ఆడిస్తున్న డ్రామా అని, దీనిని సాకుగా చూపించి జగన్ తన సెక్యూరిటీ పెంచుకోవాలని అనుకుంటున్నారని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు మాత్రం అది దాడికాదని, జగన్‌ను అతడు కలిసేందుకు వెళ్తుంటే సెక్యూరిటీ సిబ్బంది లాగిపడేశారని చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇలాంటి వీడియోలు పెట్టి టీడీపీ పరువు తీయొద్దని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.