KCR: కేసీఆర్‌కు అకస్మాత్తుగా అస్వస్థత.. అర్ధరాత్రి యశోద ఆసుపత్రిలో చేరిక

- నిన్న రాత్రి కేసీఆర్‌కు అస్వస్థత
- ఆర్థరాత్రి ఫామ్ హౌస్ నుంచి ఆసుపత్రికి తరలింపు
- ఆసుపత్రికి తరలివెళ్లిన కేటీఆర్, హరీశ్ రావు, కవిత
- వైద్య పరీక్షల అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం
- మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యం పాలయ్యారు. అకస్మాత్తుగా అస్వస్థతకు లోనుకావడంతో ఆయనను రాత్రి ఆసుపత్రిలో చేర్పించారు. ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన అర్ధరాత్రి 2.00 గంటలకు సోమాజీ గూడలోని యశోద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని తొమ్మిదవ ఫ్లోర్‌లో కేసీఆర్‌కు చికిత్స చేస్తున్నారు.
కేసీఆర్ అనారోగ్యం గురించి తెలియగానే కుటుంబసభ్యులందరూ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కేటీఆర్ కుటుంబంతో పాటూ హరీశ్ రావు, కవిత కూడా ఆసుపత్రికి వెళ్లారు. రాత్రంతా అక్కడే ఉన్నారు. కేసీఆర్‌కు చేసే వైద్యం, ఇతర పరీక్షల గురించి తెలుసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం