Food Delivery Boy : పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ ఇచ్చిన జొమాటో బాయ్.. వీడియో వైరల్

BSR NEWS
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హీట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యాజమానులు, డైవర్లు ధర్నా చేపట్టిన విషయం తెలిసింది.
zomato Food Delivery Boy : ఫుడ్ డెలివరీ యాప్ లు అందుబాటులోకి వచ్చిన తరువాత మనకు కావాల్సిన ఫుడ్ ను ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేస్తున్నాం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడాలేకుండా ఎప్పుడూ ఫుడ్ డెలివరీ అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్ కష్టాలు అనేకం ఉంటాయి. వాతావరణం అనుకూలించని సమయంలో ఫుడ్ ఆర్డర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. తాజాగా జొమాటోకు చెందిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కు హైదరాబాద్ లో అదే పరిస్థితి ఎదురైంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు బైక్ ఉన్నప్పటికీ, పెట్రోల్ అందుబాటులో లేకపోవటంతో గుర్రంపై వెళ్లి కస్టమర్ కు ఫుడ్ డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Man Attacked Food Delivery Boy : ఆర్డర్ ఆలస్యమైందని ఫుడ్ డెలివరీ బాయ్ పై 15 మంది తీవ్ర దాడి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హీట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యాజమానులు, డైవర్లు ధర్నా చేపట్టిన విషయం తెలిసింది. దీంతో పెట్రోల్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్ లో పలుప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. కొన్ని బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా క్యూ కట్టారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి.
Also Read : Truckers : కేంద్రప్రభుత్వంతో ట్రక్కర్ల సంఘం చర్చలు సఫలం…డ్రైవర్ల సమ్మె విరమణ
పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరతతో రోజువారి ఉద్యోగానికి వెళ్లేవారు, ఫుడ్ డెలివరీ బాయ్స్ పెట్రోల్ కోసం గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ ల వద్ద నో స్టార్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో పాత బస్తీలోని జొమాటో బాయ్స్ గుర్రాలపై ఆర్డర్లను డెలివరీ చేశారు. ఈ క్రమంలో జొమాటో కు చెందిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రంపై ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్తున్న క్రమంలో కొందరు వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.