సీఎం జగన్ జేబులోకి కేంద్ర నిధులు: పురందేశ్వరి BSR NESW

సీఎం జగన్ జేబులోకి కేంద్ర నిధులు: పురందేశ్వరి
AP: రైతు భరోసా నిధులలో కేంద్ర వాటాను కూడా తన ఘనతగా సీఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి విమర్శించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఆమె మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఏటా ఇస్తోన్న రూ. 350 కోట్ల నిధులు సీఎం జేబులోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ఉపాధి నిధులను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. వలసల నివారణలో ప్రభుత్వం విఫలమైందన్నారు.