సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చిరంజీవి

- చోరీకి వచ్చిన దుండగుడి చేతిలో సైఫ్ కు కత్తిపోట్లు
- సైఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కరీనా టీమ్ ప్రకటన
- దాడి విషయం తెలిసి కలత చెందానన్న మెగాస్టార్
సైఫ్ అలీఖాన్ పై దాడి విషయం తెలిసి ఎంతగానో కలత చెందానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి ముంబైలోని సైఫ్ అలీఖాన్ నివాసంలో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారని, కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారని సమాచారం. ఈ విషయం తెలిసి టాలీవుడ్ హీరోలు ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. సైఫ్ సర్ పై దాడి విషయం తెలిసి షాక్ అయినట్లు చెప్పారు.