చిత్తూరులో రేపు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ BSR NEWS

చిత్తూరులో రేపు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ
ఓటు హక్కు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించడంలో భాగంగా చిత్తూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా ర్యాలీ, ద్విచక్ర వాహనాల ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ అరుణ తెలిపారు. ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పించడం కోసం వార్డు కార్యదర్శులు, నగరపాలక సంస్థ, మెప్మా ఉద్యోగులు నగరపాలక కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గొంటారన్నారు.