యస్ ఐ వ్రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎస్.ఐ ఉద్యోగాల ప్రిలిమినరీ వ్రాత పరీక్షలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.... జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్.
మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
రేపు (ఫిబ్రవరి 19) ఎస్.ఐ ఉద్యోగాల ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారు పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి పేపర్ ... మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు రెండవ పేపర్ 2 పరీక్షలు జరుగనున్నాయన్నారు.కర్నూలు పరిసర ప్రాంతాలో 39 పరీక్షా కేంద్రాలలో మొత్తం 19,800 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు.
రూట్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీ స్ధాయి అధికారులు ఇన్ఛార్జులుగా ఉంటున్నారన్నారు. పరీక్షా కేంద్రం వద్ద సి.ఐ లేదా ఎస్సై బందోబస్తు పర్యవేక్షిస్తారన్నారు.
అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తో పాటు మరియు అదనంగా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. ఒక బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ను తెచ్చుకోవాలన్నారు.
పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందే పరీక్ష హాలులోనికి అనుమతిస్తామన్నారు. ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతించరన్నారు.
మొబైల్స్ , ఇతర డిజిటల్ పరికరాలకు అనుమతి ఉండదు, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోనున్నామన్నారు.ఈ పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.