Massive Fire : ఢిల్లీ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం...మంటలు ఆర్పిన అగ్నిమాపకశాఖ

BSR NEWS
ఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు...
Massive Fire : ఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున 1.40 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు కాల్ వచ్చిందని అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు.
ALSO READ : Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మూడవసారి సమన్లు
బవానా పారిశ్రామిక ప్రాంతంలోని సాయి ధరమ్ కాంటా సమీపంలోని సెక్టార్ -3 లోని ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే 25 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిని ప్రారంభించాయి. మంటలు అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు.