దేశ చరిత్రలోనే మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగనన్న - బియ్యపు శ్రీవాణీ రెడ్డి గారు BSR NEWS

దేశ చరిత్రలోనే మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగనన్న - బియ్యపు శ్రీవాణీ రెడ్డి గారు BSR NEWS

దేశ చరిత్రలోనే మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగనన్న - బియ్యపు శ్రీవాణీ రెడ్డి గారుశ్రీకాళహస్తి మండలం వైయస్సార్ ఆసరా నాలుగో విడతలో రూ. 10కోట్ల 63లక్షల 53వేల 350రూపాయల చెక్కును మహిళలకు అందజేశారు.శ్రీకాళహస్తిలో వైయస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గారి సతీమణి బియ్యపు శ్రీవాణీ రెడ్డి గారు మరియు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి గారు.శ్రీకాళహస్తి మండలానికి సంబంధించిన వైయస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాల కార్యక్రమం మండల ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు పాల్గొని ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా శ్రీ వాణి రెడ్డి గారు మాట్లాడుతూ, నాడు చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి మహిళలందరినీ మోసం చేశారని కానీ నేడు జగనన్న మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నేడు నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేశారని తెలిపారు. అందులో భాగంగా శ్రీకాళహస్తి మండలంలోని మహిళలు 10990 మందికి రూ. 10కోట్ల 63లక్షల 53వేల 350రూపాయలను వారి ఖాతాలో జగనన్న జమ చేశారన్నారు. మహిళల సాధికారత లక్ష్యంగా జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని మీ అందరి ఆశీర్వాదాలు జగనన్నకు ఉండాలని కోరారు. అలాగే శ్రీకాళహస్తిలో గత పాలకులు ఎన్నికలు అయిపోగానే హైదరాబాద్ కి లేదా మరి ఏదో ప్రాంతానికి వెళ్లి ఉండేవారని కానీ నేడు తన భర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుండి శ్రీకాళహస్తిలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే వారికి సహాయం చేస్తూ మీ ఇంట్లో మనిషిలాగ అందుబాటులో ఉంటున్నారన్నారు. ఎన్నికల అప్పుడు కనిపించే బొజ్జల వారు కావాలా లేదా అనునిత్యం మీ కుటుంబ సభ్యులు లాగా మీతోనే ఉండే నా భర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కావాలా అని మీరే ఆలోచన చేసి ఆశీర్వదించాలన్నారు. కరోనా సమయంలో కూడా నా భర్త మీ అందరికీ అందుబాటులో ఉంట నిత్యవసర సరుకులు కూరగాయలు పండ్లు సే విటమిన్ టాబ్లెట్లు అలాగే ముస్లిం కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ వస్తే వారికి బాస్మతి రైస్ చికెన్ కోడిగుడ్లు అందజేస్తూ మీకు తోడుగా ఉన్నారని గుర్తు చేశారు. ఆ సమయంలో మా ఇంటిళ్లపాది కరోనా వచ్చి ఎంతో ఇబ్బంది పడినా కూడా నేడు మీ అందరూ ఆనందం చూస్తుంటే మాకు అవి పెద్ద బాధగా అనిపించడం లేదు అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఎవరు చనిపోయిన వారికి పదివేల రూపాయలు అందజేస్తూ భరోసా ముస్లిం పెళ్లి కుమార్తెకు మేనమామ సాంగ్ ద్వారా డబుల్ కాట్ మంచం బీరువా ఫ్రిడ్జ్ మొదలైనవి అందజేస్తున్నామని తెలిపారు.అలాగే మీ ఇంటి బిడ్డ నా కూతురు బియ్యపు శ్రీ పవిత్ర రెడ్డి కూడా మీకు అందుబాటులో ఉంటూ ప్రతినిత్యం ప్రజా సేవ చేస్తున్నారని గుర్తు చేశారు. అనుత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి మీరందరూ అండగా ఉండి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.అనంతరం ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ, జగనన్న ప్రజాసంకల్ప యాత్రలో మహిళలు పడుతున్న కష్టాలను చూసి నాడు ఇచ్చిన మాట డ్వాక్రా రుణమాఫీని నేడు నాలుగో విడత సందర్భంగా నెరవేర్చుకున్నారు. మహిళలందరూ జగనన్నకు మీ ఆశీర్వాదాలు ఇస్తూ ఎల్లవేళలా రుణపడి ఉండాలని కోరుకున్నారు. మీ అన్న జగనన్న ను ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వాదం కొచ్చిన మహిళలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అలాగే శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అలాగే శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఒంగోలు లో జరుగుతున్న సిద్ధం సభకు సంబంధించిన ముఖ్య సమావేశానికి ఆదరణ వలన ఈరోజు ఇక్కడ రాలేకపోయారు దానికి ప్రజలందరూ తప్పుగా భావించొద్దని కోరారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే గారు అనేక సేవా కార్యక్రమాలతో ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీరుస్తున్నారన్నారు రానున్న ఎమ్మెల్యే గారు అనేక సేవా కార్యక్రమాలతో ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీరుస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో ప్రతిపక్ష నాయకులందరూ ఇళ్లల్లో ఉంటే తన ప్రాణాలను ఫణంగా పెట్టి మీ అందరికీ సేవ చేసిన గొప్ప మనిషి ఎమ్మెల్యే గారు అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తికి మరోసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మహిళలందరి మీద ఉందని మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లవేళలా మదన్నకు ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో వయ్యాల కృష్ణారెడ్డి, కందాటి ఈశ్వర్ రెడ్డి, గోవింద్ రెడ్డి, వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి, బాలి రెడ్డి,సురేంద్ర యాదవ్, రమేష్ యాదవ్, శివకుమారి, రజిని, రాములమ్మ, కృష్ణయ్య, యుగంధర్ రెడ్డి, భూషణ్ యాదవ్, చెంచయ్య యాదవ్, మధుమోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు నాయుడు, ముద్దుమూడి రవి,అంకయ్య, వయ్యాల మనోహర్ రెడ్డి, చెంచయ్య నాయుడు, సుబ్బరామయ్య, బాల గురునాథం, రఘు కేశవరెడ్డి, పుల్లయ్య, మనోహర్, నారాయణ, కప్పా సుబ్రహ్మణ్యం, దిలీప్, నక్క పెంచలయ్య, రామచంద్రయ్య, పోలయ్య, రవీందర్ రెడ్డి, మరియు సర్పంచులు,ఎంపీటీసీలు, మండల నాయకులు అలాగే ఎంపీడీవో రఫీ ఖాన్ మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.