పురందేశ్వరిది నీతి లేని చరిత్ర: విజయసాయిరెడ్డి BSR NESW

పురందేశ్వరిది నీతి లేని చరిత్ర: విజయసాయిరెడ్డి
AP: ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురందేశ్వరి అని YCP నేత, MP విజయసాయిరెడ్డి విమర్శించారు. 'BJP రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ TDPకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం. తండ్రిని అవమానించిన కాంగ్రెస్లో చేరి కేంద్రమంత్రి పదవులు అనుభవించిన నీతి లేని చరిత్ర ఆమెది. అవమానవీయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్లో ఉండి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ ఆమె' అని ట్వీట్ చేశారు.