పూతలపట్టు: వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు BSR NEWS

పూతలపట్టు: వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు మండలంలోని పేర్నమిట్టలో నూతనంగా శ్రీకోదండ రామాలయం నిర్మించారు. ఈ సందర్భంగా సీతా రాముల విగ్రహప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణ కర్తలు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, గల్లా రామచంద్ర నాయుడు ఇంటి నుంచి విరూపాక్షమ్మ గుడి వరకు ఊరేగింపుగా వెళ్లి పసుపు కుంకుమ సమర్పించారు. యాగశాలలో గోపూజ, గణపతి పూజలు చేశారు. మేళతాళాలతో సీతారాముల విగ్రహాలను ఉరేగించారు.