ఇంటి స్థలాల్లో వందల కోట్లు దోపిడీ !! BSR NEWS

*ఇంటి స్థలాల్లో వందల కోట్లు దోపిడీ !!*
*జనసేన విజయ యాత్ర - AP NEEDS PAWAN KALYAN*Day 55 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారంఈరోజు రేణిగుంట మండలం, జీపాలెం పంచాయతీ లో పద్మా నగర్, కుర్ర కాల్వ , కుర్ర కాల్వ హరిజన వాడ , అడుసుపాలెం గ్రామాల్లో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు.పూలవర్షంతో , మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన ప్రజలు. పంచాయతీలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది.రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి,అక్రమాలను , దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. ఇంటి పట్టాల పేరుతో వందల కోట్లు పంచాయతీ పరిధిలో దోచుకున్నారు, ఇందిరమ్మ ఇళ్లను వైసీపీ కార్యకర్తల కి ఏటీఎం లా అమ్ముకుంటున్నారని తెలిపారు, గ్రామాలలో స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజ్ కాలువలు లేవు, అర్హులకు ఇళ్లు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదని ప్రజలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు , ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, పట్టణ అధ్యక్షులు భాగ్య లక్ష్మి, నాయకులు లోకేష్ , శంకర్, రవి , కుమార్, రాజ , అనురాధ, భాస్కర్ బాబు, జయలలిత, గోవర్ధన్, శ్రీనివాసులు, చిన్న మురళి, బసవ పున్నయ్య , సుధ రాయల్, చిన్న మునయ్యా, రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, హేమంత్ గౌడ్ , రాజేష్, సురేష్, జనసైనికులు T.మణికంఠ,G.కుమార్,C.కిషోర్,G.ధనుష్,G.సంతోష్,C.ప్రణీత్,A.కార్తిక్,T. సాయి, పాండు, సోము, అఖిల్, జనార్ధన్, మహేష్, కరిముళ్ళ, రవి కుమార్ , తదితరులు పాల్గొన్నారు.