ఐరాల పోలీసులకు చిక్కిన దొంగ BSR NEWS

ఐరాల పోలీసులకు చిక్కిన దొంగ
అమ్మవారి నగరలతో ఓ దొంగ ఐరాల పోలీసులకు చిక్కాడు. పక్కా సమాచారంతో పాటూరు సంత గేటు బస్టాండ్ వద్ద పోలీసులు నిఘా వేశారు. ఈక్రమంలో పాకాలకు చెందిన సుబ్రహ్మణ్యం అమ్మవారి ఆభరణాలతో పట్టుబడ్డాడు. అతనితో ఉన్న మరో ఇద్దరు పరారయ్యారు. నిందితుడి నుంచి అమ్మవారి వెండి గొడుగు, బిందె, శిరస్సు, వడ్డాణం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.