ఏపీ ల్యాండ్ టైటలింగ్ ఆక్ట్ - 2023 పై న్యాయ వాదుల పోరాటానికి జనసేన సంఘీభావం!! BSR NEWS

ఏపీ ల్యాండ్ టైటలింగ్ ఆక్ట్ - 2023 పై న్యాయ వాదుల పోరాటానికి జనసేన సంఘీభావం!!ప్రజా వ్యతిరేక చట్టం అయిన ఏపీ ల్యాండ్ టైటలింగ్ ఆక్ట్ -2023 ని వెంటనే రద్దు చేయాలని న్యాయవాదులు 18వ రోజు చేస్తున్న రిలే నిరాహారదీక్ష కు ఈరోజు సంఘీభావం తెలిపిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు. ఈరోజు తిరుపతి కోర్ట్ వద్ద జనసేన పార్టీ లీగల్ సెల్ కి చెందిన న్యాయవాదులు దీక్షలో పాల్గొన్నారు, వారికి పూల మాల వేసి, దుస్సాలువతో సన్మానించి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వినుత గారు మాట్లాడుతూ ఈ చీకటి చట్టాన్ని మొదటగా వ్యతిరేకించి సంఘీభావం తెలిపిన వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని తెలిపారు. రానున్న జనసేన ఉమ్మడి Parlic ప్రభుత్వంలో ఇలాంటి చట్టాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు దండి రాఘవయ్య, రవి కుమార్ రెడ్డి, వాకాటి బాలాజీ, జ్యోతి రామ్, పేట చిరంజీవి, నగరం భాస్కర బాబు, హేమంత్ గౌడ్, గురవయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు.