పూతలపట్టులో మహిళ మృతి BSR NESW

పూతలపట్టులో మహిళ మృతి
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం యం. బండపల్లి సమీపంలోని బ్రిడ్జి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బండపల్లి గ్రామానికి చెందిన మోహన్తో కలిసి దీప అనే మహిళ బైకుపై వెళ్తుండగా.. గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ఆ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సురేష్ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.