చిత్తూరు BSR NEWS: మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు

చిత్తూరు, పలమనేరు, నగరి, పుంగనూరు రెవిన్యూ డివిజన్ కేంద్రాల్లో మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు స్థలాలను గుర్తించామని కలెక్టర్ షణ్మోహన్ చెప్పారు. ఒక్కొక్కరికి 3 సెంట్ల భూమి మార్కెట్ ధర మేర ఇచ్చేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బుధవారం మాజీ సైనికుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా సైనిక అధికారిని ఆదేశించారు.