చిత్తూరు నగరంలో రేపు జాబ్ మేళా : BSR NEWS

చిత్తూరు PVKN డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ మీరా సాహెబ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 13న 6 ప్రముఖ కంపెనీచే జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఇందులో 200 ఖాళీ పోస్టులకు గాను ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.