ఆంధ్రాను జగన్ గంజాయి రాజధానిగా చేశారు: నారా లోకేశ్ BSR NEWS

ఆంధ్రాను జగన్ గంజాయి రాజధానిగా చేశారు: నారా లోకేశ్
AP: సీఎం జగన్ ఏపీని గంజాయి రాజధానిగా మార్చారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాజాగా ఆరోపించారు. 'చంద్రబాబును జగన్ 53 రోజుల పాటు చట్టవిరుద్ధంగా జైల్లో పెట్టారు. సొంత బాబాయినే చంపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తలపై భారీ సంఖ్యలో కేసుల్ని పెట్టారు. నా మీద 22 కేసులు ఫైల్ చేశారు. తనను వ్యతిరేకించే వారిని అడ్డు తొలగించుకోవడమే జగన్ విధానం' అంటూ లోకేశ్ మండిపడ్డారు.