చిత్తూరు: బైకు, స్కూల్ బస్సు ఢీ BSR NESW

చిత్తూరు: బైకు, స్కూల్ బస్సు ఢీ జిల్లాలోని జీడీనెల్లూరు మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో తిరుపతి జిల్లా ఏర్పేడుకు చెందిన ఇద్దరు, జీడీనెల్లూరు మండలం కాళేపల్లి గ్రామానికి చెందిన ఒకరుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.