CTR: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి. BSR NEWS

CTR: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి. BSR NEWS

             CTR: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై జీడీనెల్లూరు మండలం ఎట్టేరి వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాలు మేరకు.. నెల్లేపల్లి నుంచి కడపగుంటకు బైకుపై శేఖర్, ఆయన భార్య ఉష బయల్దేరారు. మార్గమధ్యలో ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొన్నారు. శేఖర్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. భార్య ఉష పరిస్థితి విషమంగా ఉంది.