Telangana Assembly Election Polling: ఇప్పటి వరకు ఓటేసిన సినీతారలు వీరే..!

Telangana Assembly Election Polling: ఇప్పటి వరకు ఓటేసిన సినీతారలు వీరే..!

BSR NEWS

  • తెలంగాణవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
  • జూబ్లీహిల్స్‌లో ఓటేసిన చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, అల్లు అర్జున్
  • ఎస్సార్‌నగర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్న తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్‌రాజ్
  • తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 

    జూనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య ప్రణతి, తల్లి షాలిని, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు భార్య సురేఖ, కుమార్తె శ్రీజతో కలిసి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి క్యూలో నిల్చున్నారు. జూబ్లీహిల్స్‌లోనే ఎమ్మల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్సార్‌నగర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 188లో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌‌రాజ్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు.