గణనాథుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి BSR NEWS

గణనాథుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నటరాజ్ తన కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వాద మండపంలో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏఈ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.