Mallu Bhatti Vikramarka: పాడిరంగం అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తాం: మల్లు భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka: పాడిరంగం అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తాం: మల్లు భట్టి విక్రమార్క

BSR NEWS 

  • మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024లో పాల్గొన్న మల్లు భట్టి
  • డెయిరీ రంగాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ
  • బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులను కేటాయించినట్లు వెల్లడి

పాడిరంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. డెయిరీ రంగాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. తాము ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులను కేటాయించామని గుర్తు చేశారు. సోమవారం హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు.