కాణిపాకం: ఈనెల 30న సంకటహర గణపతి వ్రతం BSR NESW

కాణిపాకం: ఈనెల 30న సంకటహర గణపతి వ్రతం BSR NESW

         కాణిపాకం: ఈనెల 30న సంకటహర గణపతి వ్రతం

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీన సంకటహర గణపతి వ్రతం వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గణపతి వ్రతం వేడుకలు నిర్వహిస్తామన్నారు. అనంతరం పురవీధుల్లో స్వర్ణ రథోత్సవం ఊరేగుతుందన్నారు. ఈ వేడుకలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈఓ కోరారు.