ఇవాళ స్కూళ్లు, కాలేజీలు బంద్ BSR NEWS

ఇవాళ స్కూళ్లు, కాలేజీలు బంద్
AP: విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు మద్దతుగా నవంబర్ 8న విద్యాసంస్థల బంద్ చేపట్టనున్నట్లు PDSU, AISF, SFI, AIYF ప్రకటించాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి ఇవాల్టితో వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపట్టనున్నారు. అన్ని యువజన, విద్యార్థి సంఘాలు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి.