కౌన్సిలర్లు కౌన్సిల్ నియమావళిని తప్పకుండా పాటించాలి – మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర
ఈ రోజు ఏర్పాటు చేసిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల తీరు కౌన్సిల్ సభ్యులకు చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఉందని పోడియం వద్దకు దూసుకువచ్చి విచక్షణా రహితంగా అరుస్తూ తోటి కౌన్సిలర్లను దుర్బాషలాడుతూ కౌన్సిల్లర్లు వ్యవహరించిన తీరు ఇబ్బంది కరంగా ఉందని చైర్ పర్సన్ స్థానంలో ఉన్న నేను పలుమార్లు వెళ్ళి మీ మీ సీట్లలో కూర్చోవలసినదిగా మీకున్న ఏ సమస్య అయిన కౌన్సిల్ ముందు ఉంచి చర్యలు తీసుకుంటామని పలు మార్లు హెచ్చరించడం జరిగిందని అయిననూ కౌన్సిల్ సభ్యులు పోడియం వద్ద కూర్చుని కౌన్సిల్ సమావేశం మొత్తాన్ని తప్పుదారి పట్టిస్తుండటంతో, చివరి ప్రయత్నంగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు 13 మంది సభ్యులను నెల రోజుల పాటు సస్పెండ్ చేయడం జరిగిందని, వారు హద్దులు దాటి పోడియం ముందు రచ్చ చేస్తుండటం,కౌన్సిల్ సమావేశాన్ని ఇబ్బంది పెట్టడం తో పోలీస్ వారి సహకారం తో వారందరిని బయటకు పంపివేయడం జరిగిందని మీడియాకు తెలియచేశారు. ఇక ముందు నుంచైనా గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ కౌన్సిల్ లో వ్యవహరించాల్సిన తీరు తెలుసుకుంటారని ఆకాంక్షించారు.