Vasantha Krishna Prasad: చంద్రబాబును తిట్టాలని జగన్ చెప్పారు.. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నా: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

BSR NEWS
- దేవినేని ఉమతో వ్యక్తిగత ద్వేషాలు లేవన్న కృష్ణప్రసాద్
- విపక్ష నేతలను తిట్టే వారికే వైసీపీలో టికెట్లు ఇస్తారని విమర్శ
- వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని వెల్లడి
మరో రెండు రోజుల్లో తాను వైసీపీలో చేరుతానని వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటానని చెప్పారు. మైలవరం నియోజకవర్గంలోని కార్యకర్తలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తానని తెలిపారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని... పార్టీ హైకమాండ్ సమక్షంలో ఇద్దరం కలిసి అన్నీ మాట్లాడుకుంటామని కృష్ణప్రసాద్ చెప్పారు. ఇదే సమయంలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, నారా లోకేశ్ లను వ్యక్తిగతంగా తిట్టాలని జగన్ చెప్పారని అన్నారు. మైలవరం టికెట్ ఇస్తామని చెపుతూనే వారిని తిట్టాలని అన్నారని చెప్పారు. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని తెలిపారు. విపక్ష నేతలను తిట్టే వారికే వైసీపీలో టికెట్లు ఇస్తారని దుయ్యబట్టారు.