చిత్తూరు: రెండు రోజులు అవగాహన సదస్సు BSR NESW

చిత్తూరు: రెండు రోజులు అవగాహన సదస్సు
గ్రామ పంచాయతీల్లో నగదు రహిత చెల్లింపులపై పంచాయతీ కార్యదర్శులకు గురు, శుక్రవారాల్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డీపీవో లక్ష్మి తెలిపారు. పంచాయతీల్లో పన్నులు, ఇతరాలకు సంబంధించి పీవోఎస్ యంత్రాలు, క్యూఆర్ కోడ్ ఉపయోగించడంపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 3 వేల కన్నా ఎక్కువ జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు పీవోఎస్ యంత్రాలు, మూడు వేలకు తక్కువ జనాభా గల పంచాయతీలకు క్యూఆర్ కోడ్ ఇస్తామన్నారు.