BSR NESW

31న 'మేరా యువ భారత్' ప్రారంభం: మోదీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈనెల 31న 'మేరా యువ భారత్ ' ప్లాట్ఫాంను ప్రారంభించనున్నట్లు PM మోదీ తెలిపారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించేందుకు ఇది అనేక అవకాశాలను కల్పిస్తుందని మన్ కీ బాత్లో వెల్లడించారు. యువత mybharat.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పండుగలలో ప్రజలు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేశారని, రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.