దేశం లోనే టాప్ 5 యురాలజీ సర్జన్ గా అవార్డు దక్కించుకున్న కడియాల లలిత్ సాగర్.

దేశం లోనే టాప్ 5 యురాలజీ సర్జన్ గా అవార్డు దక్కించుకున్న కడియాల లలిత్ సాగర్.

డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కు 'టైమ్స్ ఐకానిక్ అఫ్ హెల్త్‌కేర్' అవార్డు

కిడ్నీ సర్జన్ గా ఏపీలోనే టాప్ 5గా నిలిచిన వైద్యుడు మన లలిత్ సాగర్ 

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతులమీదుగా అవార్డు అందుకున్న డా:లలిత్ సాగర్

-----------

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే యూరాలజీ వైద్యవిభాగ సేవలందించడంలో టాప్ 5 కిడ్నీ సర్జన్ గా డాక్టర్ కడియాల లలిత్ సాగర్ నిలిచారు. ఇందుకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్' అవార్డును డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దక్కించుకున్నారు. విశాఖపట్నంలో శనివారం రాత్రి జరిగిన 'టైమ్స్' మెగా కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఐకానిక్ లీడర్ హెల్త్ కేర్ పేరిట అత్యుత్తమ వైద్య సేవలందించిన వైద్యులకు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతేటా ప్రతిభావంతులను ఎంపిక చేసి ఈ అవార్డులను అందజేస్తుంది. ఇందులో భాగంగా టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్- 2025ను కిడ్నీ (యూరాలజీ ) సర్జన్ డాక్టర్ కడియాల లలిత్ సాగర్ అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడమనేది యూరాలజీ వైద్య విభాగం పట్ల ఆయన అంకితభావం, నైపుణ్యం, నిబద్ధతకు గుర్తింపు గా చెప్పుకోవచ్చు. వైద్యరంగంలో ప్రముఖ కిడ్నీ సర్జన్ గా సేవలందించడంలో నాణ్యతను మెరుగు పరచడానికి డాక్టర్ కడియాల లలిత్ సాగర్ చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయంగా నిలిచాయి. అవార్డు స్వీకరించిన డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ.. పలువురు వైద్య ప్రముఖుల సమక్షంలో టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డును కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందుకోవడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం హయాంలోనే వైద్యులకు తగిన ప్రోత్సాహం కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి మంచి వాతావరణం ఏర్పడిందన్నారు. అందుబాటునే ఖరీదైన వైద్యాన్ని కూడా తక్కువ ఖర్చుతో అందించాలనే తన లక్ష్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సమర్ధ నాయకుడైన నారా లోకేష్ లే స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారి సతీమణి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సైతం వైద్యరంగంలో అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె దర్శి నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఇంఛార్జిగా కూడా పనిచేస్తున్నారు. అవార్డు స్వీకరణలో డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తో పాటు వారి సతీమణి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, కుమారులు కడియాల అక్షయ్ నంద, అభయ్ వర్ధన్ ఉన్నారు.

-------