Zoleka Mandela: కేన్సర్‌తో నెల్సన్ మండేలా మనవరాలి కన్నుమూత

Zoleka Mandela, nelson madela, bsr news, breaking news, telugu news, darsi news,

Zoleka Mandela: కేన్సర్‌తో నెల్సన్ మండేలా మనవరాలి కన్నుమూత
Zoleka Mandela
  • 43 సంవత్సరాల అతి చిన్న వయసులోనే మృతి
  • చివరి శ్వాస వరకు రచయితగా, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగా పనిచేసిన జొలేకా మండేలా
  • 32 ఏళ్ల వయసులో తొలిసారి కేన్సర్ బారిన జొలేకా
  • అప్పుడు కోలుకున్నా మళ్లీ తిరిగబెట్టి ప్రాణాలు తీసిన మహమ్మారి
  • దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా కన్నుమూశారు. రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె 43 సంవత్సరాల చిన్న వయసులోనే మృతి చెందారు. రచయిత, ఉద్యమకారిణి కూడా అయినా జొలేకా కేన్సర్ చికిత్స కోసం ఈ నెల 18న ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆమె కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులతోపాటు శరీరంలోని ప్రధాన భాగాలకు కేన్సర్ కణాలు వ్యాపించినట్టు పేర్కొన్నారు. 
  • జొలేకా 1980లో జన్మించారు. ఆమె చనిపోవడానికి ముందు వరకు కూడా రచయితగా, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగా, న్యాయం కోసం పోరాడే ఉద్యమకారిణిగా పనిచేశారు. ఆమెకు నలుగురు పిల్లులు ఉన్నారు. 32 ఏళ్ల వయసులోనే తొలిసారి కేన్సర్ బారినపడిన ఆమె చికిత్సతో కోలుకున్నారు. అయితే, 2016లో మరోమారు అది తిరగబెట్టింది. ఈసారి మాత్రం అది చికిత్సకు లొంగలేదు. జొలేకా ప్రాణాలు బలితీసుకుంది.  2010లో ఆమె 13 ఏళ్ల కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అప్పటి నుంచి రోడ్ సేఫ్టీ క్యాంపెయినర్‌గానూ అవగాహన కల్పిస్తున్నారు.

    తనకు కేన్సర్ సోకిన విషయంతో పాటు చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, డ్రగ్స్ అలవాటు వంటి విషయాలను ఆమె ఇటీవలే ఓ డాక్యుమెంట్‌లో వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడి సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని అనుభవించిన నెల్సన్ మండేలా ఆ తర్వాత ఆ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు. జొలేకా మృతికి నెల్సన్ మండేలా ఫౌండేషన్ సంతాపం తెలిపింది