Pedro Henrique: లైవ్‌లో ప్రదర్శన ఇస్తూ కుప్పకూలి మరణించిన బ్రెజిల్ గోస్పెల్ సింగర్

Pedro Henrique: లైవ్‌లో ప్రదర్శన ఇస్తూ కుప్పకూలి మరణించిన బ్రెజిల్ గోస్పెల్ సింగర్

BSR NEWS

  • 30 ఏళ్ల అతిచిన్న వయసులోనే మృతి చెందిన పెడ్రో హెన్రిక్
  • ఆడియన్స్‌ను కలుసుకునేందుకు స్టేజి చివరికి వచ్చి పట్టుతప్పి పడిపోయిన గాయకుడు
  • హార్ట్ ఎటాక్‌తోనే మృతి చెందాడన్న వైద్యులు

బ్రెజిల్ గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్ లైవ్ ప్రదర్శన ఇస్తూ స్టేజిపైనే కుప్పకూలి మృతి చెందాడు. 30 సంవత్సరాల అతి పిన్న వయసులోనే ఆయనలా మరణించడాన్ని ప్రదర్శనకు హాజరైనవారు జీర్ణించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ విజువల్స్ ప్రకారం.. ప్రదర్శన ఇస్తూ ఆడియన్స్‌ను కలుసుకునేందుకు స్టేజీ చివరికి వచ్చాడు. ఈ క్రమంలో బ్యాలన్స్ కోల్పోయి వెనక్కి పడిపోయి నేలను బలంగా ఢీకొట్టాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. బ్రెజిల్‌ గోస్పెల్ మ్యూజిక్‌లో రైజింగ్ స్టార్‌గా పేరుకెక్కిన హెన్రిక్ మృతి తీవ్ర విషాదం నింపింది.